శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 11:42:58

అంద‌రినీ భ‌య‌పెట్టే పోలీస్‌నే గ‌జ‌గ‌జవ‌ణికేలా చేసిందో పాము!

అంద‌రినీ భ‌య‌పెట్టే పోలీస్‌నే గ‌జ‌గ‌జవ‌ణికేలా చేసిందో పాము!

ఎవ‌రికీ భ‌య‌కుండా బ‌తికేది ఒకే ఒక్క పోలీస్‌. అలాంటి పోలీస్‌ను హాస్పిట‌ల్‌పాలు చేసిందో పాము. అయినా ఈ పాముకి ఎంత ధైర్యం. ఎస్పీ మాయ‌న‌క్ షూలోకే దూరింది. దూరింది కాసేపు ఉండి వెళ్లిపోకుండా అక్క‌డే నివాసం ఉండాల‌నుకున్న‌దేమో. ప్ర‌తిరోజూ డ్యూటీకి వెళ్లే పోలీస్ ఆ రోజు కూడా త్వ‌ర‌త్వ‌ర‌గా రెడీ అయి షూ ధ‌రించాడు. లోప‌ల ఏదో క‌దులుతున్న‌ట్లు అనిపించి వెంట‌నే బ‌య‌ట‌కు తీశాడు.

ఈ లోపే ఆ మాయ‌దారి పాము పోలీస్‌ను కాటేసింది. వెంట‌నే అత‌న్ని హాస్పిటల్‌కు త‌ర‌లించారు. స‌మ‌యం మించిపోలేదు కాబ‌ట్టి ప్రాణానికేం ప్ర‌మాదం లేద‌ని చెప్పారు డాక్ట‌ర్లు. ఈ సంఘ‌టన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకున్న‌ది. అందుకే చెప్పేది. బ‌ట్ట‌లు, షూలు ఇలా ఏవైనా ధ‌రించేట‌ప్పుడు ఒక‌టికి రెండుసార్లు చెక్ చేసుకొని వేసుకోవాలి. పోలీస్ అదృష్ట‌వంతుడు కాబ‌ట్టి స‌రిపోయింది. అంద‌రికి అలా ఉండ‌దు క‌దా. 


logo