శనివారం 11 జూలై 2020
National - Jun 19, 2020 , 18:05:15

పాములు ప‌ట్టే వ్య‌క్తిని క‌రిచిన నాగుపాము..

పాములు ప‌ట్టే వ్య‌క్తిని క‌రిచిన నాగుపాము..

తిరువ‌నంత‌పురం : కేర‌ళ‌లోని న‌వీకులంలో దారుణం జ‌రిగింది. పాములు ప‌ట్టే వ్య‌క్తినే ఓ నాగుపాము క‌రిచింది. దీంతో అత‌ను అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. 

ఈ నెల 14వ తేదీన న‌వీకులంలో నాగుపాము ఉంద‌ని స్థానికులు పాములు ప‌ట్టే వ్య‌క్తి జ‌కీర్ హుస్సేన్(30)కు స‌మాచారం అందించారు. దీంతో అత‌ను అక్క‌డికి చేరుకుని పామును ప‌ట్టుకున్నాడు. అది అత‌ని చేయిపై కాటు వేసింది. కాసేప‌టికే ఆయ‌న స్పృహ కోల్పోయాడు. నోట్లో నుంచి నుర‌గ తీస్తూ కుప్ప‌కూలిపోయాడు. కొన ఊపిరి ఉన్న స‌మ‌యంలోనే త‌న స్నేహితుడు ముకేష్‌కు ఫోన్ చేసి జ‌రిగిన విష‌యాన్ని చెప్పాడు. 

కుప్ప‌కూలిపోయిన జ‌కీర్ ను స్థానికులు.. స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించేలోగా ప్రాణాలు విడిచాడు. ఇక మ‌రో వ్య‌క్తి వావ సురేశ్(పాములు ప‌ట్టే వ్య‌క్తి)కు స్థానికులు స‌మాచారం అందించారు. అత‌ను వ‌చ్చి నాగుపామును ప‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత దాన్ని తీసుకెళ్లి అడ‌విలో వ‌దిలేశాడు. 

జ‌కీర్ గ‌త 11 సంవ‌త్స‌రాల నుంచి పాముల‌ను ప‌డుతున్నాడు. ఈ కాలంలో 348 పాముల‌ను ప‌ట్టుకున్నాడు. 12 సార్లు అత‌న్ని పాములు కాటేశాయి. కానీ వాటి నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. జ‌కీర్ కు భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.


logo