ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 23:22:54

ఢిల్లీ విమానాశ్రయంలో రూ.66 లక్షల విదేశీ సిగరెట్లు పట్టివేత

ఢిల్లీ విమానాశ్రయంలో రూ.66 లక్షల విదేశీ సిగరెట్లు పట్టివేత

ఢిల్లీ: విదేశీ సిగరెట్లను అక్రమంగా రవాణా చేస్తున్న 13 మంది భారతీయులపై ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులు కేసు నమోదు చేశారు. వీరంతా కొవిడ్‌ కారణంగా దుబాయ్‌లో చిక్కుకున్నవారు కావడం విశేషం. ఈనెల 23వ తేదీన ఉదయం 9.05 గంటలకు దుబాయ్‌ నుంచి ఢిల్లీకి ఈకే-510 విమానంలో వచ్చారు. గ్రీన్ చానల్ దాటిన తర్వాత, ఈ 13 మంది భారతీయ ప్రయాణీకులను అధికారులు పట్టుకున్నారు.  కస్టమ్స్‌ చట్టం-1962లోని 110 సెక్షన్‌ ప్రకారం విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.66.60 లక్షలు. కస్టమ్స్‌ చట్టం-1962లోని 104 సెక్షన్‌ ప్రకారం 13 మంది భారతీయులను అరెస్ట్‌ చేశారు.  logo