మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 18:21:30

స్మార్ట్‌ హెల్మెట్‌.. ఇది బాడీ టెంపరేచర్‌ను స్కాన్‌ చేస్తుంది

స్మార్ట్‌ హెల్మెట్‌.. ఇది బాడీ టెంపరేచర్‌ను స్కాన్‌ చేస్తుంది

ముంబై :  కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ తమ సిబ్బందికి స్మార్ట్‌ హెల్మెట్లను అందజేసింది. ఇది కంటైన్మెంట్‌ జోన్‌లో ఉండే ప్రజలను పరీక్షించడానికి వీలుగా ఉంటుందని కార్పొరేషన్‌ అధికారులు తెలియజేశారు. 

కరోనా వ్యాప్తిని ఆరికట్టడానికి ఏర్పాటు చేసిన ’మిషన్‌ జీరో’లో భాగంగా ఈ స్మార్ట్ హెల్మెట్లను ప్రయోగించారు. ఇవి పోర్టబుల్ థర్మో-స్కానర్లను కలిగి ఉంటాయి. హెల్మెట్‌లోని థర్మల్ కెమెరా ఒకేసారి 13 మంది వరకు, నిమిషంలో 200 మంది ఉష్ణోగ్రతలను పరీక్షించగలదు. సిబ్బంది వీటిని ధరించి కంటైన్మెంట్‌ జోన్‌లో ఇంటింటికి తిరిగి ప్రజల నుదుటి వైపు చూస్తే ఇది ఆటోమెటిక్‌గా టెంపరేచర్‌ను స్కాన్‌ చేస్తుంది. ప్రస్తుతం వీటిని పాజిటివ్‌ కేసులను పరీక్షించడానికి ఉపయోగిస్తున్నారు. logo