మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 01, 2020 , 19:42:53

మేక ఆక‌లి తీర్చేందుకు నిచ్చెన‌గా మారిన గేదె!

మేక ఆక‌లి తీర్చేందుకు నిచ్చెన‌గా మారిన గేదె!

ఎంతైనా మూగ‌జీవాల తెలివితేట‌ల‌కు మ‌నిషిగా సిగ్గుప‌డాల్సిందే.. బాగా ఆక‌లిగా ఉన్న మేక‌కు చెట్టు మీదున్న ఆకులు క‌నిపించాయి కాని అందుకునేంత ఎత్తు లేక‌పోవ‌డంతో నిరాశ‌కు గురైంది.  ఆకలితో అరిచినా ప‌ట్టించుకునేందుకు అక్క‌డ య‌జ‌మాని కూడా లేడు. త‌న బాధ‌నంతా ఎదురుగా ఉన్న గేదెతో చెప్పుకున్న‌ది. సాటి మూగ‌జీవానికి తాను సాయం చేయ‌క‌పోతే ఎలా అనుకున్న‌దో ఏమో గేదె..

మేక జంప్ చేసి గేదె మీద‌కి ఎక్కింది. ఇప్పుడు ఎత్తు కూడా పెర‌గ‌డంతో ఆకులు అందుకునేందుకు సులువుగా మారింది. గేదెను నిచ్చెన‌గా మార్చుకున్న మేక ఆకులు తిని క‌డుపు నింపుకున్న‌‌ది. మేక రిక్వెస్ట్‌ను గేదె కూడా అంగీక‌రించిన్న‌ట్లుగా వీడియోలో చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి సుధా రామెన్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది వైర‌ల్‌గా మారింది.  'ఇలా ఐక‌మ‌త్యంగా ఉంటే ఇంకేం కావాలి, మేక తెలివితేటలు సూప‌ర్' అంటున్నారు నెటిజ‌న్లు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo