పుణే : మహారాష్ట్రలోని జిల్గావ్ జిల్లాలో శిక్షణ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. ప్రమాదంలో పైలెట్ దుర్మరణం చెందగా మహిళా పైలెట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఫ్లయింగ్ స్కూల్‌కు చెందిన చిన్న తరహా ఎయిర్ క్రాఫ్ట్‌లో పైలెట్‌తోపాటు మహిళా పైలెట్ ప్రయాణిస్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో చోప్డా జిల్లా వార్ది గ్రామ సమీపంలోని సత్పురా పర్వత శ్రేణి పరిధిలో కుప్పకూలింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన మహిళా పైలెట్‌ను చికిత్స నిమిత్తం సమీపంలో దవాఖానకు తరలించారు. సాంకేతిక లోపం కారణంగానే ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు