శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 23:18:14

వీరప్పన్‌ కూతురుకి బీజేపీలో కీలక పదవి

వీరప్పన్‌ కూతురుకి బీజేపీలో కీలక పదవి

చెన్నై : గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్ప్‌ కూతురు విద్యారాణికి భారతీయ జనతా పార్టీ కీలక బ్యాధతలను అప్పగించింది. తమిళనాడు యువ మోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆదివారం నియమించింది. తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్‌ అయిన వీరప్పన్‌ కూతురుకు బీజేపీ రాష్ట్రస్థాయి పదవిలో నియమించింది.  వృత్తిరీత్యా న్యాయవాది, సామాజిక కార్యకర్త అయిన విద్య 2019 ఫిబ్రవరిలో తన అనుచరులు ౩వేలమందితో కలిసి బీజేపీలో చేరింది. అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కాగా, గంధపు చెక్కల స్మగ్లర్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వీరప్పన్‌ 2004లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అంశం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. త‌మిళ‌నాడులోని అణ‌గారిన వ‌ర్గాలు, అట‌వీ స‌మీప గ్రామాల్లో వీరప్పన్‌కు అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు ఆమెకు కీలక పదవిని కట్టబెట్టినట్లు తెలుస్తుంది.

తన నియామకం గురించి ఫేస్‌బుక్‌ పోస్టు ద్వారా తెలిపింది. తన ప్రధాన ఎజెండా ‘సామాజిక సేవ’ అని తెలిపారు.  తన తండ్రి గురించి తీసుకుంటే.. తన తాత గారి గ్రామానికి సెలవుల కోసం వెళ్లినప్పుడు 6-7 ఏళ్ల వయసులో ఒకేసారి కలిశానని పేర్కొంది. ‘అతను మేము ఆడుతున్న చోటుకు వచ్చాడు.. నాతో మాట్లాడడానికి కొద్ది నిమిషాలు గడిపి, వెళ్లిపోయాడు’. అని చెప్పింది. డాక్టర్‌ కావాలని, ప్రజలకు సేవ చేయాలని తన తండ్రి చెప్పినట్లు గుర్తు చేసుకుంది. ఆయన సేవలో నన్ను సామాజిక సేవ చేయడానికి ప్రేరేపించాయని చెప్పింది. ‘అతను ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు. కానీ ఆయన విధానం, చర్యలు అతని చుట్టూ ఉన్న ప్రపంచంపై ఆయనకున్న అవగాహనపై ఆధారపడి ఉన్నాయి.

వన్నియార్‌ సమాజం కోసం ఆయన చేసిన కృషి గురించి చాలా వివరణలు ఉన్నాయి’ అని విద్య తెలిపారు.  ఆమె తల్లి ముత్తులక్ష్మి ఇప్పటికీ పీఎంకే, వన్నియార్ పార్టీ, ఎన్డీయే మిత్రపక్షమైన టీవీకేతో అనుబంధం ఉంది. పిల్లల కోసం పాఠశాల నడుపుతున్న విద్య.. కేంద్ర మాజీ మంత్రి రాధాకృష్ణతో పరిచయం అయిన కొన్ని సంవత్సరాల తరువాత ఫిబ్రవరిలో బీజేపీలో చేరారు. తనకు సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉందని ఆమె చెప్పిన తర్వాత, పార్టీలో చేరాలని ఆయన సూచించారు. ఈ మేరకు 2019, ఫిబ్రవరిలో కాషాయ పార్టీలో జాయిన్‌ అయ్యారు. తమిళనాడు యువ మోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమించడంతో మరోసారి వీరప్పన్‌ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.logo