ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 15:37:30

చ‌నిపోయిన మ‌ట‌న్ ముక్క గిల‌గిలా కొట్టుకుంటున్న‌ది!

చ‌నిపోయిన మ‌ట‌న్ ముక్క గిల‌గిలా కొట్టుకుంటున్న‌ది!

కోడి, మేక‌ల‌ను కోసేట‌ప్పుడు మాత్రం అయ్యో పాపం, చీ, థూ అని అంటాం. తినేట‌ప్పుడు మాత్రం వావ్.. య‌మ్మీ అంటూ లొట్ట‌లేసుకుంటూ తింటాం. ఇలా ఉంటుంది మనిషి తీరు. బ‌తికున్న‌ప్పుడు మాంసాన్ని ప‌ట్టుకోవాలంటే భ‌య‌ప‌డుతారు కొంద‌రు. అదే ముక్క‌లు ముక్క‌లుగా క‌ట్ చేస్తే వాటికి మ‌సాలా యాడ్ చేసి వండేస్తారు. అలా క‌ట్ చేసిన మ‌ట‌న్ ముక్క‌ల‌ను మ‌రింత చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి వండుదామ‌నుకున్న ఒక మ‌హిళ‌కు అనుకోని సంఘ‌ట‌న ఎదురైంది.

ప‌హంగ్‌లోని టెమ‌ర్లోహ్ ప్రాంతానికి చెందిన నేరో అనే మ‌హిళ మ‌ట‌న్ క‌ర్రీ చేద్దామ‌నుకున్న‌ది. ముక్క‌లు కాస్త పెద్ద‌గా ఉండేస‌రికి చిన్న‌గా క‌ట్ చేద్దామ‌ని చోపింగ్ బోర్డ్ మీద‌కు తీసుకున్న‌ది. ముక్క‌ను రెండోవైపుకు తిప్పేస‌రికి మ‌ట‌న్ ముక్క గిలా గిలా కొట్టుకుంటున్న‌ది. ఎలా అంటే.. గుండె కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా. దీంతో ఆమె భ‌య‌ప‌డి వెంట‌నే త‌న ఫోన్‌లో వీడియో తీసింది. దీన్నిసోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. మ‌ట‌న్‌ముక్క‌ క‌ద‌ల‌డానికి కార‌ణం తాజా మాంసంలోని న‌రాల్లో ఇంకా జీవం ఉంటుంది. అందుకే అలా క‌దులుతుంటాయ‌ని చెబుతున్నారు. 


logo