శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 22, 2020 , 16:37:46

నమస్తే ట్రంప్‌ ఈవెంట్‌.. స్కై పాట్రోలింగ్‌ వీడియో

నమస్తే ట్రంప్‌ ఈవెంట్‌..  స్కై పాట్రోలింగ్‌ వీడియో

మోతేరా స్టేడియం ఆవరణలో స్కై పాట్రోలింగ్‌ నిర్వహించారు.


అహ్మదాబాద్‌:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.   అహ్మదాబాద్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద మోతేరా స్టేడియం 'నమస్తే ట్రంప్‌' సభకు ఆతిథ్యం ఇవ్వనున్నది.  ఈనెల 24న డొనాల్డ్‌ ట్రంప్‌ నాగరిక్‌ అభినందన్‌ సమితి ఆధ్వర్యంలో మోతేరా స్టేడియంలోనే నమస్తే ట్రంప్‌ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మోతేరా స్టేడియం ఆవరణలో  స్కై పాట్రోలింగ్‌ నిర్వహించారు.  మోదీ, ట్రంప్‌ సాక్షిగా ఈ స్టేడియంలో జరుగనున్న సభకు లక్ష మందికిపైగా ప్రజలు హాజరవుతారని అంచనా.

భారత పర్యటన కోసం ట్రంప్‌ దంపతులతో పాటు వారి కూతురు ఇవాంకా ట్రంప్‌, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ కూడా వస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ట్రంప్‌, ఆయన భార్య మెలానియాతో పాటు ఆర్థిక శాఖ మంత్రి స్టీవెన్‌ మ్యూనిచ్‌, వాణిజ్యశాఖమంత్రి విల్బర్‌ రోస్‌, జాతీయ భద్రతా సలహాదారు డెరెక్‌ ఓబ్రెయిన్‌, ఇంధనశాఖ మంత్రి డాన్‌ బ్రౌలిట్టే వంటి అత్యున్నత స్థాయి అధికారుల బృందం వస్తున్నారని మాత్రమే అమెరికా ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.logo