సోమవారం 28 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 11:36:52

ఆరేళ్ల అమ్మాయి రేప్‌.. నిందితుల ఊహాచిత్రాలు రిలీజ్‌

ఆరేళ్ల అమ్మాయి రేప్‌.. నిందితుల ఊహాచిత్రాలు రిలీజ్‌

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హ‌పుర్ జిల్లాలో ఆరేళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేశారు. ఆ చిన్నారి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ది. మ‌రో వైపు పోలీసులు నిందితుల కోసం అన్వేషిస్తున్నారు. నాలుగు రోజుల త‌ర్వాత పోలీసులు ఆరేళ్ల అమ్మాయిని రేప్ చేసిన నిందితుల ఊహాచిత్రాల‌ను రిలీజ్ చేశారు.  అమ్మాయి త‌ల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్కెచ్‌ల‌ను విడుద‌ల చేశారు. ఢిల్లీకి వంద కిలోమీట‌ర్ల స‌మీపంలో ఉన్న గ‌ర్ ముక్తేశ్వ‌ర్ ప్రాంతం నుంచి అమ్మాయిని కిడ్నాప్ చేశారు. పేరెంట్స్ మిస్సింగ్ కేసు న‌మోదు చేశారు.  మ‌రుస‌టి రోజు స్పృహ‌లేని స్థితిలో.. స‌మీప గ్రామంలో చిన్నారిని గుర్తించారు.  ఆ అమ్మాయిని రేప్ చేసిన‌ట్లు వైద్య ప‌రీక్ష ద్వారా తేల్చారు. మీర‌ట్ హాస్పిట‌ల్‌లో ఆ అమ్మాయిని చేర్పించారు.  


logo