ఆదివారం 29 మార్చి 2020
National - Mar 04, 2020 , 10:22:17

ఆ ఆరుగురికి కరోనా నెగిటివ్‌

ఆ ఆరుగురికి కరోనా నెగిటివ్‌

న్యూఢిల్లీ : ఢిల్లీలో పరీక్షలు చేసిన ఆరుగురికి కరోనా లేదని వైద్యులు తేల్చారు. నిన్న నోయిడాలో ఆరుగురు అనుమానితుల నుంచి వైద్యులు రక్త నమూనాలు సేకరించారు. అనుమానితులను 14 రోజుల పాటు వైద్య పరిశీలనలో అధికారులు ఉంచనున్నారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఇటీవలే ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చాడు. అతనికి కరోనా సోకింది. ఆ వ్యక్తి ఇంట్లో ఇటీవలే బర్త్‌డే పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి ఆరుగురు వెళ్లారు. వీరి రక్తనమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా.. కరోనా నెగిటివ్‌ వచ్చింది. అయినప్పటికీ వీరిని వేర్వేరుగా 14 రోజుల పాటు పరిశీలనలో ఉంచనున్నారు.


logo