గురువారం 02 జూలై 2020
National - Jun 20, 2020 , 01:39:16

పిల్లలు, తండ్రులు.. ఉరి! గుజరాత్‌లో ఆరుగురి మృతి

పిల్లలు, తండ్రులు.. ఉరి! గుజరాత్‌లో ఆరుగురి మృతి

అహ్మదాబాద్‌: ఇద్దరు అన్నదమ్ములు, వారి నలుగురు పిల్లలు ఓ ఖాళీ ఫ్లాట్‌లో సీలింగ్‌ఫ్యాన్లకు బిగించిన తాళ్లకు విగతజీవులై వేలాడుతూ కనిపించారు. ఈ విషాదఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో చోటుచేసుకుంది. నగరవాసులైన అమ్రిష్‌ పటేల్‌ (42), గౌరంగ్‌ పటేల్‌ (40) అన్నదమ్ములు. ఇద్దరికీ ఒక్కో కొడుకు, ఒక్కో కూతురు ఉన్నారు. నలుగురు పిల్లలతో కలిసి బయటకు వెళ్తున్నామని తమ భార్యలకు చెప్పి బుధవారం వారు బయటకు వెళ్లి గురువారం రాత్రికి కూడా తిరిగి రాలేదు. దీంతో వారి భార్యలు తమ కుటుంబానికే చెందిన ఓ ఖాళీ ఫ్లాట్‌ వద్దకు వెళ్లి చూడగా.. అది లోపలి నుంచి గొళ్లెం పెట్టి ఉంది. వారిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి తలుపులు తెరిచి చూడగా వేర్వేరు రూముల్లో ఫ్యాన్లకు ఉరివేసుకుని ఆరుగురు చనిపోయి ఉన్నారు. అన్నదమ్ములు పిల్లలకు తొలుత ఆహారంలో మత్తుపదార్థాలు కలిపి ఆ తర్వాత వారికి ఉరి వేసి ఉంటారని, అనంతరం తాము కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 


logo