గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 19:54:35

ఒకే కుటుంబంలోని ఆరుగురు కరోనాతో మృతి

ఒకే కుటుంబంలోని ఆరుగురు కరోనాతో మృతి

రాంచీ: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కరోనాతో మరణించారు. జార్ఖండ్‌లోని ధన్బాద్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కాట్రాస్‌లోని ఒక కుటుంబానికి చెందిన 88 ఏండ్ల మహిళ ఢిల్లీలో జరిగే వివాహానికి హాజరై ధన్బాద్‌కు తిరిగి వచ్చారు. అనంతరం ఆమె అనారోగ్యానికి గురై బొకారోని దవాఖానలో చికిత్స పొందుతూ ఈ నెల 4న చనిపోయారు. ఐదుగురు కుమారులు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది.

అనంతరం 50 నుంచి 60 ఏండ్ల వయసున్న ఐదుగురు కుమారులకు కూడా కరోనా సోకింది. చికిత్స పొందుతున్న వీరింతా ఇటీవల వరుసగా మరణించారు. ఆ కుటుంబంలోని మరో ఇద్దరికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. మరోవైపు ఆ కుటుంబ సభ్యులను కలిసిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,500 దాటగా 49 మంది మరణించారు.



logo