శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 08:10:07

తమిళనాడులో ఘోర ప్రమాదం : ఆరుగురు మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం : ఆరుగురు మృతి

చెన్నై : తమిళనాడులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నామక్కల్‌ వద్ద వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులను బీహార్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. 

మహారాష్ట్ర రాజధాని ముంబయిలోనూ ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. వోర్లీ సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, కారు నడుపుతున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఫిబ్రవరి నెలలో కోయంబత్తూరు తిరుప్పూర్‌ సమీపంలో ఓ కంటెయినర్‌.. అదుపుతప్పి బస్సుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు మృతి చెందిన విషయం విదితమే. మృతుల్లో 14 మంది పురుషులు, మిగతా వారు మహిళలు. 


logo