మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 13:09:57

ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు తీవ్రవాదుల హతం

ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు తీవ్రవాదుల హతం

ఇటానగర్‌: అరుణాచల్‌ప్రదేశ్‌లో భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు నాగా మిలిటెంట్లు హతమయ్యారు. తిరాప్‌ జిల్లా ఖోన్సా ప్రాంతంలో శనివారం ఉదయం 4.30 గంటలకు ఎన్‌కౌటర్‌ జరిగిందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. నాగా వేర్పాటువాద సంస్థ అయిన నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలిమ్‌ (ఎన్‌ఎస్‌సీఎన్‌)-ఐఎమ్‌ సభ్యులు జరిపిన కాల్పుల్లో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఓ సైనికుడు గాయపడ్డాడని తెలిపారు. 

నిగావర్గాల సమాచారంతో అస్సాం రైఫిల్స్‌కు చెందిన బలగాలు, అరుణాచల్‌ప్రదేశ్‌ పోలీసులు సంయుక్తంగా తిరాప్‌ జిల్లాలోని ఖోన్సా ప్రాంతంలో గాలింపు చేపట్టాయని డీజీపీ ఆర్పీ ఉపాధ్యాయ తెలిపారు. ఘటనా స్థలంలో నాలుగు ఏకే 47 తుపాకులు, రెండు చైనీస్‌ ఎంక్యూ, 5 కిలోల పేలుడు పదార్థాలు, ఒక కిలో ఐఈడీ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

ఎన్‌ఎస్‌సీఎన్‌ (ఐఎం) గత కొన్ని దశాబ్దాల నుంచి నాగాలకు ప్రత్యేక దేశం ఉండాలని పోరాడుతున్నది. 


logo