మంగళవారం 07 జూలై 2020
National - Jun 19, 2020 , 14:53:27

ప్లాట్‌లో ఆరు మృతదేహాలు

ప్లాట్‌లో ఆరు మృతదేహాలు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విషాదకరమైన ఘటన వెలుగుచూసింది. ప్లాట్‌లో ఆరుగురు కుటుంబసభ్యులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అమ్రిష్‌ పటేల్‌ (42), గౌరంగ్‌ పటేల్‌(40) ఇద్దరు సోదరులు. వీరిద్దరి కుటుంబాలు అహ్మదాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అయితే జూన్‌ 17న అమ్రిష్‌, గౌరంగ్‌  నలుగురు పిల్లలతో కలిసి ఔటింగ్‌ వెళ్తున్నామని వాళ్ల భార్యలకు చెప్పి బయటకు వచ్చారు. అయితే ఔటింగ్‌కు వెళ్లిన తమ భర్తలు, పిల్లలు  తిరిగిరాకపోవడంతో ఇద్దరు మహిళలు అహ్మదాబాద్‌ పట్టణంలో ఉన్న తమ ఫ్లాట్‌కు వెళ్లి డోర్‌ కొట్టారు.

ఇంటి తలుపులు బిగిసి ఉండటంతో పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా ఇంట్లో సీలింగ్‌కు ఫ్యాన్స్‌కు ఆరుగురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించారు. ఫ్యాన్లకు వేలాడుతున్న అమ్రిష్‌, గౌరంగ్‌తోపాటు నలుగురు చిన్నారుల మృతదేహాలను పోలీసులు కిందికి తీశారు.  అమ్రిష్‌, గౌరంగ్‌ మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చి తమతోపాటు పిల్లల ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఆర్‌ కోహ్లీ ఆఫ్‌ వట్వా జీటీడీసీ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ డీఆర్‌ గోహిల్‌ తెలిపారు. 


logo