సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 01:43:26

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం
  • ఆటోను ఢీకొట్టిన మినీలారీ
  • ఆరుగురి మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో మినీలారీ ఢీకొని ఆరుగురు మృత్యువాతపడగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పసికందు ఉన్నారు. సోమవారం ఉదయం నరసరావుపేట నుంచి ఫిరంగిపురం వైపు వస్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన మినీలారీ రేపూడి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎడ్లపాడు మండలం కొత్తకోట గ్రామానికి చెందిన కాకాని రమాదేవి (40, కాకాని యశస్విని (11 నెలలు)తోపాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాకాని బాలమణికంఠ (5)సహా మరొకరు దవాఖానలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.

logo