గురువారం 04 జూన్ 2020
National - May 09, 2020 , 21:20:06

ఢిల్లీలో 20 గంట‌ల్లో 224 కొత్త క‌రోనా కేసులు

ఢిల్లీలో 20 గంట‌ల్లో 224 కొత్త క‌రోనా కేసులు

ఢిల్లీ:  దేశ రాజ‌ధాని ఢిల్లీలో గ‌డిచిన 20 గంట‌ల్లో కొత్త‌గా 224 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 6,542కు చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారిన‌ప‌డి 68 మంది మృత్యువాత ప‌డ్డారు. ఈ రోజు వ‌ర‌కు 4,454 మంది బాధితులు చికిత్స పొందుతుండ‌గా, 2020 మంది బాధితులు చికిత్స అనంత‌రం ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఖాజూరి ఖాస్ పోలీస్ స్టేష‌న్‌కు చెందిన ఆరుగురు పోలీసు సిబ్బందికి క‌రోనా వైర‌స్ సోకింది. వైర‌స్ సోకిన వారిలో కానిస్టేబుల్‌, హెడ్‌కానిస్టేబుల్ ర్యాంకు అధికారులు ఉన్నారు. 


logo