సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 16:10:37

జర్నలిస్టులపై దాడి..ఆరుగురు అరెస్ట్‌

జర్నలిస్టులపై దాడి..ఆరుగురు అరెస్ట్‌

ముంబై: జర్నలిస్టులపై దాడి చేసిన ఆరుగురు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. సబర్బన్‌ ఒశివారాలోని భగత్‌ సింగ్‌ నగర్‌ ఏరియాలో మంగళవారం 19 ఏళ్ల యువతి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందింది. ఆ తర్వాత కొందరు ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు ఆ యువతి తల్లితో మాట్లాడటానికి ఆమె ఇంటికి వెళ్లారు. మీడియావాళ్లు యువతి తల్లితో మాట్లాడి తిరిగొస్తుండగా సుమారు 10-15 మంది వారిని దూషిస్తూ..దాడి చేశారు.  జర్నలిస్టుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. మరో ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి వారి కోసం గాలింపు చేపట్టారు. 


logo