శనివారం 28 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 13:28:13

కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు : ఈడీ అదుపులోకి మాజీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ

కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు : ఈడీ అదుపులోకి మాజీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ

తిరువనంతపురం : కేరళ మాజీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శివశంకర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఆయన దాఖలు చేసిన యాంటిసిపేటరి బెయిల్‌ పిటిషన్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించిన తర్వాత అధికారులు ఈ చర్య చేపట్టారు. ఆయనను కొచ్చిలోని ఈడీ కార్యాలయానికి తరలించనున్నారు. అనంతరం ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో ఆయన పాత్ర ఉందని పేర్కొంటూ బెయిల్‌ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించింది. శివశంకర్, ఆయన చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాల్‌ వాంగ్మూలంలో ఉన్న వైరుధ్యాలను ఈ కేసులో మరో నిందితురాలైన స్వప్నా సురేశ్‌తో సంబంధాలున్నాయని ఈడీ పేర్కొంది.

ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అయిన శివశంకర్‌ ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. తిరువనంతపురంలోని తన ఇంటి నుంచి శివశంకర్‌ను అరెస్టు చేసేందుకు కస్టమ్స్ ఈ నెల 16న అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. శివశంకర్‌కు ఛాతినొప్పి రావడంతో ఆయనను ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మెడికల్‌ కాలేజీకి తీసుకురాగా.. ఆయనకు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏవీ కనిపించలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. శివశంకర్‌ ఈ నెల 19న ముందస్తు బెయిల్‌ పొందడం ద్వారా తప్పించుకున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.