బుధవారం 27 జనవరి 2021
National - Dec 22, 2020 , 11:55:49

సిస్ట‌ర్ అభయ హ‌త్య కేసులో సీబీఐ కోర్టు తీర్పు

సిస్ట‌ర్ అభయ హ‌త్య కేసులో సీబీఐ కోర్టు తీర్పు

కేర‌ళ : 28 ఏళ్ల క్రితం సంచ‌ల‌నం సృష్టించిన‌ సిస్ట‌ర్ అభయ హ‌త్య కేసులో సీబీఐ కోర్టు మంగ‌ళ‌వారం తీర్పు వెల్ల‌డించింది. ఈ కేసులో ఫాద‌ర్ థామ‌స్ కొట్టూర్‌, న‌న్ సెఫీని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. నిందితులిద్ద‌రికి ఈ నెల 23న సీబీఐ కోర్టు శిక్ష‌ల‌ను ఖ‌రారు చేయ‌నుంది. 1992 మార్చి 27న కొట్టాయంలో సిస్ట‌ర్ అభ‌య హ‌త్య‌కు గురైంది. సిస్ట‌ర్ అభ‌య‌ను ఫాద‌ర్ థామ‌స్ కొట్టూర్‌, న‌న్ సెఫీ క‌లిసి హ‌త్య చేసిన‌ట్లు కోర్టు నిర్ధారించింది. 28 ఏళ్ల త‌ర్వాత హ‌త్య కేసులో తీర్పు వెల్ల‌డైంది.  

కేసు పూర్వ‌ప‌రాలు..  1992లో సిస్ట‌ర్ అభయ(21) కేర‌ళ‌లోని బీఎంసీ కాలేజీలో సైకాల‌జీ కోర్సు చేస్తోంది. అప్పుడు థామ‌స్ కొట్టూరు సైకాల‌జీ అధ్యాప‌కుడిగా అక్క‌డ ప‌ని చేస్తున్నాడు. అయితే అదే ఏడాది మార్చి 27న తెల్ల‌వారుజామున 4:15 గంట‌ల‌కు సిస్ట‌ర్ అభ‌య త‌న హాస్ట‌ల్ నుంచి కిచెన్ వైపు వెళ్లింది. కిచెన్ వ‌ద్ద ఓ క్రైస్త‌వ స‌న్యాసినితో థామ‌స్ కొట్టూర్‌, జోస్ పుత్రుక్క‌యిల్ అభ్యంత‌ర‌క‌ర రీతిలో క‌నిపించారు. ఈ త‌తాంగాన్ని చూసిన అభ‌య‌.. బ‌య‌ట‌కు చెబితే ప‌రువు పోతుంద‌నే భ‌యంతో ఆమెను హ‌త్య చేసి అక్క‌డున్న బావిలో ప‌డేశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్ట‌గా అస‌లు విష‌యాలు వెలుగు చూశాయి. 


logo