శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 22, 2020 , 15:17:14

స‌వాల్ చేశారుగా చ‌ర్చిద్దాం రండి

స‌వాల్ చేశారుగా చ‌ర్చిద్దాం రండి

  • యూపీ మంత్రుల‌కు ఢిల్లీ డిప్యూటీ సీఎం పిలుపు
  • ఈ రోజంతా ల‌క్నోలోనే ఉంటాన‌న్న మ‌నీష్ సిసోడియా

ల‌క్నో: ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ ప‌రి‌పాల‌న‌ల్లో ఎవ‌రి ప‌రిపాల‌న గొప్ప‌ద‌నే విష‌యంపై బ‌హిరంగ చ‌ర్చ కోసం ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ల‌క్నోకు వెళ్లారు. రోజంతా తాను ల‌క్నోలోనే ఉంటాన‌ని, యూపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున త‌న‌తో చ‌ర్చించ‌డానికి ఎవ‌రు వ‌చ్చినా సిద్ధ‌మ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ నెల 16న అర‌వింద్ కేజ్రివాల్ యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగుతామ‌ని ప్ర‌క‌టించ‌గానే, యూపీ బీజేపీ మంత్రులు, నేత‌లు ఢిల్లీలో కేజ్రివాల్ ప‌రిపాల‌న‌పై విమర్శ‌లు మొద‌లుపెట్టారు. 

యోగీ, కేజ్రివాల్ ప‌రిపాల‌న‌ల్లో ఎవ‌రి ప‌రిపాల‌న గొప్ప‌దో చ‌ర్చించేందుకు సిద్ధ‌మా..? అని యూపీ మంత్రులు స‌వాల్ చేశారు. ఢిల్లీలో విద్యావ్య‌వ‌స్థ ప‌రిస్థితి అధ్వాన్నంగా ఉన్న‌ద‌ని విమ‌ర్శించారు. దాంతో యూపీ మంత్రుల‌ స‌వాల్‌ను స్వీక‌రిస్తున్న‌ట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ప్ర‌క‌టించారు. ఈ నెల 22న ల‌క్నోకు వ‌స్తాన‌ని, ఆ రోజు యోగీ స‌ర్కారు త‌ర‌ఫున‌ ఎవ‌రు చ‌ర్చ‌కు వ‌చ్చినా సిద్ధ‌మ‌ని స్ప‌ష్టంచేశారు. ఆ మేర‌కే ఇవాళ ల‌క్నోకు వ‌చ్చి బీజేపీ నేత‌ల‌ను చ‌ర్చ‌ల‌కు ర‌మ్మ‌ని స‌వాల్ విసిరారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ర‌కుల్ ప్రీత్ సింగ్ కు క‌రోనా పాజిటివ్‌

జ‌ర్న‌లిస్ట్‌ నిలువు దోపిడీ.. నిందితుల కోసం గాలింపు

దేశంలో 3 ల‌క్ష‌ల దిగువకు యాక్టివ్ కేసులు
ప్ర‌ఖ్యాత కార్య‌క‌ర్త క‌రీమా బలూచ్ మృతి
ప‌బ్‌లో రెయిడ్‌.. సురేశ్ రైనా అరెస్టు

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.     


logo