బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 09:53:28

భారత్‌లో ఒక్కరోజే 52,123 కరోనా కేసులు

భారత్‌లో ఒక్కరోజే 52,123 కరోనా కేసులు

ఢిల్లీ:  భారత్‌లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. గత కొద్దిరోజుల నుంచి ప్రతిరోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 52,123 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

ఒక్కరోజు వ్యవధిలోనే 775 మంది చనిపోయారు. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15,83,792కు చేరింది. ప్రస్తుతం 5,28,242 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 10,20,582 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 34,968కు పెరిగింది. దేశరాజధాని ఢిల్లీలో కరోనా ఉద్ధృతి స్వల్పంగా తగ్గింది. 

 దేశవ్యాప్తంగా ఈనెల 29 వరకు 1,81,90,382  కోవిడ్‌-19  శాంపిల్స్‌ టెస్టు చేసినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది. నిన్న ఒక్కరోజే 4,46,642 నమూనాలు పరీక్షించినట్లు వెల్లడించింది. 


logo