గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 12:33:26

బోసిపోయిన బీజేపీ ప్రధాన కార్యాలయం..

బోసిపోయిన బీజేపీ ప్రధాన కార్యాలయం..

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. దాదాపు 50కి పైగా అసెంబ్లీ స్థానాల్లో ఆప్‌ ఆధిక్యంలో కొససాగుతోంది. దీంతో, ఆప్‌ భారీ మెజార్టీతో గెలవబోతుందని తెలిసి బీజేపీ.. పార్టీ ప్రధాన కార్యాలయం నిర్మానుష్యంగా మారింది. ఈసారి ఎలాగైనా ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో గెలిచి, రాజధాని రాష్ట్రంలో ఆధిపత్యం చెలాయించాలనుకున్న బీజేపీ.. ఎన్నికల కౌంటింగ్‌ చూసి, బిత్తరపోయింది.  గెలుపు దారులు మూసుకుపోయే సరికి పార్టీ పెద్దలు గానీ, కార్యకర్తలు గానీ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం బోసిపోయింది. కాగా, గత ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 67 స్థానాలు గెలుచుకొని పూర్తి ఆధిక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ కేవలం 3 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుచుకొని, ప్రతిపక్ష స్థానంలో నిలిచింది. ఢిల్లీ అసెంబ్లీ పీఠంపై అనేక సార్లు జెండా ఎగురవేసిన కాంగ్రెస్‌ పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానం కూడా గెలవకపోగా, ప్రస్తుత ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి కనబడుతోంది. 


logo