ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 17:13:16

సిక్కింలో తొలి కరోనా మరణం

సిక్కింలో  తొలి కరోనా మరణం

న్యూఢిల్లీ:  కరోనా కాటుకు సిక్కిం రాష్ట్రంలో  తొలి మరణం చోటుచేసుకుంది.  ఆదివారం గ్యాంగ్‌టక్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో 74ఏళ్ల వ్యక్తి కరోనా బారినపడి మృతిచెందినట్లు ఆరోగ్యశాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.  చనిపోయిన వ్యక్తి తూర్పు సిక్కిం జిల్లాలోని   రోంగ్లీ సబ్‌ డివిజన్‌కు చెందినవాడని నిర్ధారించారు.   కోవిడ్‌-19 కారణంగా ఇవాళ తెల్లవారుజామున అతడు మరణించాడని ఆరోగ్యశాఖ డైరెక్టర్‌, సెక్రటరీ డాక్టర్‌ పెమా టీ భూటియా తెలిపారు.

అతడు మధుమేహంతో పాటు బీపీ తదితర వ్యాధులతో   బాధపడుతున్నాడన్నారు. సిక్కింలో ప్రస్తుతం 357 యాక్టివ్‌ కేసులున్నాయి. జూలై 21 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నది. రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదుకావడంతో లాక్‌డౌన్‌ను ఆగస్టు 1 వరకు పొడిగించారు. 


logo