శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 16:37:32

పాక్ రాయబార కార్యాలయం ఎదుట సిక్కుల నిరసన

పాక్ రాయబార కార్యాలయం ఎదుట సిక్కుల నిరసన

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఎదుట సిక్కులు నిరసన తెలిపారు. పాకిస్థాన్‌లో సిక్కులను బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారని వారు ఆరోపించారు. పంజా సాహిబ్ హెడ్ గ్రాంథి కుమార్తెను అపహరించడం అసహ్యకరమైన చర్య అని మండిపడ్డారు. పాకిస్థాన్‌లో ఔరంగజేబ్ పాలన జరుగుతున్నదని విమర్శించారు. ఈ మేరకు ఫ్లకార్డులు ప్రదర్శించి పాక్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆ దేశంలో సిక్కుల మతమార్పిడిపై ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్తామని ఢిల్లీ సిక్కు గురుద్వారా నిర్వాహణ కమిటీ చీఫ్ ఎంఎస్ సిర్సా తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.