బుధవారం 20 జనవరి 2021
National - Dec 04, 2020 , 14:48:39

రైతులపై నోరు పారేసుకున్న కంగ‌నాకు లీగ‌ల్ నోటీసు

రైతులపై నోరు పారేసుకున్న కంగ‌నాకు లీగ‌ల్ నోటీసు

ముంబై: వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజ‌ధానిలో ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న రైతుల‌పై నోరు పారేసుకున్న బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్‌కు లీగ‌ల్ నోటీసు పంపించింది ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్‌మెంట్ క‌మిటీ (డీఎస్‌జీఎంసీ). ఆమె ట్వీట్లు రైతుల‌ను అవ‌మానించేలా ఉన్నాయ‌ని, వెంట‌నే బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని క‌మిటీ డిమాండ్ చేసింది. రైతుల‌తో క‌లిసి ధ‌ర్నా చేస్తున్న ఓ రైతు త‌ల్లిపై కంగనా నోరు పారేసుకుంది. ఇలాంటి వాళ్లు రూ.100కు దొరుకుతార‌ని ఆమె ట్వీట్ చేసింది. రైతుల‌ను జాతి వ్య‌తిరేకులుగా ఆమె చిత్రీక‌రిస్తోంద‌ని డీఎస్‌జీఎంసీ ఆరోపించింది. ష‌హీద్ బాగ్ దాది కూడా రైతుల ఆందోళ‌న‌లో పాలుపంచుకుంటోంది అని కంగ‌నా త‌న ట్వీట్‌లో రాసింది. అందులో ఇద్ద‌రు వృద్ధ మ‌హిళ‌ల ఫొటోను షేర్ చేసింది. అందులో ఒక‌రు టైమ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై క‌నిపించిన బిల్కిస్ బానో కూడా ఉన్నారు. టైమ్ క‌వ‌ర్ పేజీపై క‌నిపించిన దాది రూ.100కు అందుబాటులో ఉంది అని కంగ‌నా ట్వీట్ చేసింది. 


logo