బుధవారం 08 జూలై 2020
National - Jun 30, 2020 , 19:08:46

అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయాలి: సిద్ధరామయ్య

అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయాలి: సిద్ధరామయ్య

బెంగళూరు: రాష్ట్రంలోని దవాఖానల్లో కొవిడ్‌ చికిత్సకు సంబంధించిన సమస్యలను పర్యవేక్షించేందుకు అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేయాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం బీఎస్‌ యడ్యూరప్పను ట్విట్టర్‌లో కోరారు. అనేక ఫిర్యాదుల నేపథ్యంలో ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు ఇది చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ చికిత్స నిర్వహణలో అవినీతి, స్వపక్షభావన చూపుతున్నారనే ఆరోపణల వినిపిస్తున్నాయన్నారు.

ఈ సంక్షోభ సమయంలో ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించడమే ప్రభుత్వ ఏకైక లక్ష్యం కావాలని సిద్ధరామయ్య పేర్కొన్నారు. చికిత్సకు సంబంధించిన ప్రొటోకాల్‌ను వెంటనే విడుదల చేయాలి, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలని ఆయన సీఎంను కోరారు. అలాగే, ప్రైవేట్‌ దవాఖానల వైద్యులు, నర్సులు, సపోర్ట్‌ స్టాఫ్‌కు బీమా గడువును పొడిగించాలన్నారు.

  


logo