సియాచిన్‌పై జెండా పాతిన యోధుడి మృతి

న్యూఢిల్లీ: కశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న సియాచిన్ గ్లేసియర్‌ను పూర్తి స్థాయిలో సర్వే చేసి, ఆ మంచు శిఖరంపై భారతీయ త్రివర్ణ పతకాన్ని పాతిన సైనిక యోధుడు కల్నల్ నరేంద్ర కుమార్ ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఆయన జన్మించారు. తొలుత నరేంద్ర బుల్ కుమార్.. కుమాన్ రెజిమెంట్‌లో పని చేశారు. సియాచిన్ గ్లేసియర్‌కు కల్నల్ నరేంద్ర సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు. సియాచిన్ విశిష్టతను తెలియజేస్తూ అతనో రిపోర్ట్ తయారు చేశారు. ఆ నివేదిక ఆధారంగానే 1984 ఏప్రిల్ 13వ తేదీన ఆ నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆపరేషన్ మేఘదూత్‌కు ఓకే చెప్పారు.
ఆపరేషన్ మేఘదూత్..
పాక్ ఆర్మీతో జరిగిన సమరంలో.. సియాచిన్ గ్లేసియర్‌ను భారతీయ దళాలు చేజిక్కించుకున్నాయి. రెండు దేశాలను వేరే చేసే 109 కిలోమీటర్ల యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్(ఏజీపీఎల్) ప్రస్తుతం మన ఆధీనంలో ఉన్నది. ఆ కీలక గ్లేసియర్ భూభాగం మన ఆధీనంలోకి రావడానికి ఈ కల్నలే కారణం. కల్నల్ నరేంద్ర కుమార్ మంచు పర్వతాన్ని అధిరోహించడం వల్ల ఆ ప్రాంతం మన సొంతం అయ్యింది. అయితే ఆ ఎక్స్పడీషన్లో సొంతమైన ప్రాంతాన్ని కుమార్ బేస్‌గా ఆర్మీ పిలుస్తోంది. 1970 దశకంలో గుల్మార్గ్లో కల్నల్ కుమార్ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఓ జర్మనీ అన్వేషకుడు చూపిన మ్యాప్ ఆధారంగా.. సియాచిన్ ప్రాంతంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నట్లు తేలింది. 1949 ఒప్పందం ప్రకారం సియాచిన్‌పై భారత్, పాక్ దేశాల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో ఇందిరా హయాంలో ఆపరేషన్ మేఘదూత్ చేపట్టారు. 1965లో మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన కెప్టెన్ ఎంఎస్ కోహ్లీ బృందంలో కల్నల్ కుమార్ ఉన్నారు.
తాజావార్తలు
- మరో నాలుగు రోజులు..
- గ్రామాల అభివృద్ధేప్రభుత్వ ధ్యేయం
- ‘పట్టభద్రుల’ ఓటర్లు 4,91,396
- నేటి నుంచి నిరంతరాయంగా..
- ఆకాశం హద్దుగా!
- పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
- కోడేరు అభివృద్ధ్దికి కంకణం కట్టుకున్నా
- ప్రభుత్వభూమి ఆక్రమణపై హైకోర్టును ఆశ్రయిస్తాం
- కాళేశ్వరంలో మళ్లీ జలసవ్వడి
- నల్లమల ఖ్యాతి నలుదిశలా విస్తరించాలి