ఆదివారం 17 జనవరి 2021
National - Jan 13, 2021 , 01:55:16

నిలకడగా కేంద్ర మంత్రి నాయక్‌ ఆరోగ్యం

నిలకడగా కేంద్ర  మంత్రి నాయక్‌ ఆరోగ్యం

పనాజీ: కర్ణాటకలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్‌కు  ఒక కాలు, రెండు చేతులు విరిగాయని గోవా మెడికల్‌ కాలేజీ అండ్‌ దవాఖాన (జీఎంసీహెచ్‌) సీనియర్‌ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. దీంతో సర్జరీ చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం మంత్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిపారు. ఈ ప్రమాదంలో  నాయక్‌ భార్య విజయ, పీఏ దీపక్‌ మరణించిన విషయం తెలిసిందే.