సోమవారం 30 మార్చి 2020
National - Mar 27, 2020 , 15:16:43

షిర్డీ సంస్థాన్‌ ట్రస్టు 51 కోట్ల విరాళం

షిర్డీ సంస్థాన్‌ ట్రస్టు 51 కోట్ల విరాళం

ముంబయి : కరోనా నివారణ చర్యలకు ఆర్థిక సాయం చేసేందుకు దేశ వ్యాప్తంగా పలువురు ముందుకు వస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు తమకు చేతనైనంతా ఆర్థిక సాయం చేస్తున్నారు. మహారాష్ట్ర సీఎం సహాయనిధికి షిర్డీ సంస్థాన్‌ ట్రస్ట్‌ భారీ విరాళం ప్రకటించింది. కరోనా నివారణ చర్యలకు రూ. 51 కోట్ల విరాళాన్ని అందించినట్లు షిర్డీ సంస్థాన్‌ ట్రస్ట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అరుణ్‌ డోంగ్రే మీడియాకు వెల్లడించారు. దేశానికి సేవ చేసేందుకు షిర్డీ సంస్థాన్‌ ట్రస్ట్‌ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు కూడా ఈ ట్రస్ట్‌ రూ. 12 కోట్లు ఆర్థిక సాయం చేసింది. ఇక మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 130కి చేరింది నలుగురు మృతి చెందారు. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 724కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.


logo