శనివారం 30 మే 2020
National - May 18, 2020 , 10:41:34

2700 కి.మీ. ప్రయాణించనున్న శ్రామిక్‌ రైలు

2700 కి.మీ. ప్రయాణించనున్న శ్రామిక్‌ రైలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి సుమారు 1550 మంది వలస కార్మికులతో శ్రామిక్‌ ప్రత్యేకరైలు మణిపూర్‌ బయల్దేరింది. ఈ రైలు దాదాపు 2700 కి.మీ. దూరం ప్రయాణించనుంది. లాక్‌డౌన్‌తో ఆంధ్రప్రదేశ్‌లో చిక్కుకుపోయిన ఈశాన్య రాష్ర్టాలకు చెందిన వలస కార్మికులు ఈ ప్రత్యేక రైలులో వారి స్వస్థలాలకు పయణమయ్యారు. ఈ రైలును ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతం సవాంగ్‌ జెండా ఊపి ప్రారంభించారు. 

కరోనా వేరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు చిక్కుకుపోయారు. దీంతో వారిని స్వస్థలాలకు తరలించడానికి కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. ఈ కార్యక్రమాన్ని మే 31 వరకు పొడిగించారు.


logo