గురువారం 04 జూన్ 2020
National - May 11, 2020 , 13:12:52

ఇక పూర్తి సామర్థ్యంతో శ్రామిక్‌ రైళ్లు

ఇక పూర్తి సామర్థ్యంతో శ్రామిక్‌ రైళ్లు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన వలస కార్మికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్న శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను ఇకపై పూర్తి సామర్థ్యంతో నడుపుతామని రైల్వే అధికారులు ప్రకటించారు. అదేవిధంగా రాష్ర్టాలు కోరినట్లుగా చివరి స్టాప్‌లో కాకుండా, ఆ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో రైలు ఆగుతుందని వెల్లడించారు. భౌతిక దూరం నిబంధనలో భాగంగా ఇప్పటివరకు ఖాళీగా ఉంచుతూ వస్తున్న మధ్య బెర్తులను కూడా ప్రయాణికులకు కేటాయిస్తామని తెలిపారు. ఒక రైలులో 24 బోగీలు ఉంటాయని, ఒక్కో బోగీలో 72 మంది ప్రయాణించడానికి అవకాశం ఉంటుంద, ప్రస్తుతం 54 మందికి మాత్రమే అనుమతిస్తున్నామని చెప్పారు.

రోజు మూడు వందల రైళ్లను నడుపుతున్నామని, సాధ్యమైనంత ఎక్కువ మంది కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చాలంటే వాటి సంఖ్యను మంరింతగా పెంచనున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా మే 1 నుంచి ఇప్పటివరకు సుమారు ఐదు లక్షల మందిని రైల్వే శాఖ తమ స్వస్థలాలకు చేరవేసింది.


logo