మంగళవారం 07 జూలై 2020
National - May 02, 2020 , 08:18:30

కార్మికుల కోసం ' శ్రామిక్ స్పెష‌ల్ ట్రైన్ '

కార్మికుల కోసం ' శ్రామిక్ స్పెష‌ల్ ట్రైన్ '

మ‌ధ్యప్ర‌దేశ్ : లాక్ డౌన్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వ‌లస కార్మికుల‌ను వారి స్వ‌స్థ‌లాల‌కు పంపించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి పొట్ట‌కూటి కోసం మ‌హారాష్ట్ర‌లోని నాసిక్ కు వ‌ల‌స వ‌చ్చి..అక్క‌డే ఉండిపోయిన కార్మికుల‌ను ప్ర‌భుత్వం ప్ర‌త్యేక రైలును ఏర్పాటు చేసింది.

కార్మికుల కోసం శ్రామిక్ స్పెష‌ల్ ట్రైన్ భోపాల్ కు సమీపంలోని మిస్రోడ్ రైల్వే స్టేష‌న్ కు చేరుకోనుంది. తొలుత కార్మికులంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన తర్వాత రైళ్ల‌లో నాసిక్ నుంచి వారి వారి ప్రాంతాల‌కు చేరవేయ‌నున్న‌ట్లు మ‌హారాష్ట్ర వైద్య శాఖ ఉన్న‌తాధికారులు తెలిపారు.  


logo