ఆదివారం 31 మే 2020
National - May 11, 2020 , 11:12:18

విద్యుత్ శాఖ ఉద్యోగికి క‌రోనా.. శ్ర‌మ శ‌క్తి భ‌వ‌న్ సీజ్‌

విద్యుత్ శాఖ ఉద్యోగికి క‌రోనా.. శ్ర‌మ శ‌క్తి భ‌వ‌న్ సీజ్‌

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం కేంద్ర ప్ర‌భుత్వం అమ‌ల్లోకి తీసుకొచ్చిన నిబంధ‌నల మేర‌కు ఢిల్లీలోని శ్ర‌మ‌శ‌క్తి భ‌వ‌న్ మూత‌ప‌డింది. శ్ర‌మ‌శ‌క్తి భ‌వన్‌లో కేంద్ర విద్యుత్ శాఖ‌కు చెందిన కార్యాల‌యం ఉన్న‌ది. ఈ కార్యాల‌యంలో ప‌నిచేసే ఒక ఉద్యోగికి ఇటీవ‌ల క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో శ్ర‌మ శ‌క్తి భ‌వ‌న్‌ను పూర్తిగా  మూసివేశారు. ఆ బిల్డింగ్‌లో ప‌నిచేసి ఇత‌ర ఉద్యోగులు ఇండ్ల నుంచే ప‌నిచేయాల‌ని ఆదేశించారు. తాము త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ కొన‌సాగించాల‌ని సూచించారు.   


logo