గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 08, 2020 , 01:51:56

అందరికీ స్వాగతం పలికే దేశాన్ని చూపించండి

అందరికీ స్వాగతం పలికే దేశాన్ని చూపించండి

న్యూఢిల్లీ: దేశంలో శరణార్థుల సంఖ్యను తగ్గించడానికే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తీసుకొచ్చామని విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ చెప్పారు. ప్రపంచంలో ఏ ఒక్క దేశం అందరికీ స్వాగతం పలుకదని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఈటీ గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో ప్రతి ఒక్కరిని స్వాగతించే దేశాన్ని చూపండి. కానీ ఏ ఒక్కరు చూపలేరు’ అని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్‌లో పరిస్థితిపై ఐరాస మానవ హక్కుల మండలి చేసిన విమర్శలపై మండి పడ్డారు.  


logo