గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 25, 2020 , 22:06:12

హింసాత్మక చర్యలు ఆపాలి: ఢిల్లీ సీఎం

హింసాత్మక చర్యలు ఆపాలి: ఢిల్లీ సీఎం

న్యూఢిల్లీ: నగరంలో హింసాత్మక చర్యలు ఆపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హెచ్చరించారు.  ఆయన ఢిల్లీ ఆందోళనలో గాయడినవారిని పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ఈ హిసాత్మక ఘటనల్లో చాలా మంది మృత్యువాత పడుతున్నారనీ.. వందల సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు గాయాలపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలు తెలియజేస్తే శాంతియుతంగా ఉండాలి. కానీ, ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకునేలా వ్యవహరించకూడదని సీఎం అన్నారు. ఈ హింసాత్మక ఘటనలు చాలా బాధాకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అల్లర్లలో హిందువులు, ముస్లింలు చనిపోయారని సీఎం తెలిపారు.

గత రెండు, మూడు నెలలుగా ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా.. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. అన్ని రాష్ర్టాల్లో శాంతియుతంగా ర్యాలీలు, నిరసనలు తెలియజేస్తే, ఢిల్లీలో మాత్రం నిత్యం అల్లర్లు జరుగుతున్నాయి. కాగా, ఢిల్లీలో ఆందోళనల నేపథ్యంలో 4 ప్రాంతాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూ విధించిన ప్రాంతాలు.. మౌజ్‌పూర్‌, జఫరాబాద్‌, చాంద్‌బాగ్‌, కరవాల్‌నగర్‌.


logo