శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 21:24:27

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి: గోవా గవర్నర్‌

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి: గోవా గవర్నర్‌

పనాజి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని గోవా గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ తెలిపారు. ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజీత్‌ రాణే, చీఫ్‌ సెక్రెటరీలతో గవర్నర్‌.. సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకూ కరోనా బాధితులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా వ్యాపించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ తెలిపారు. ఎవరైనా అనుమానితులు ఉంటే వారిని గుర్తించి, క్వారంటైన్‌లో ఉంచాలన్నారు. 

రాష్ట్ర ప్రజలంతా స్వీయనిర్బంధంలో ఉండాలనీ, ప్రతి ఒక్కరు విధిగా సామాజిక దూరం పాటించాలని తెలిపారు. ఈ మహమ్మారి వైరస్‌ చైనా, ఇటలీ, ఇరాన్‌ వంటి దేశాల్లో విలయతాండవం సృష్టిస్తుందనీ.. ఇప్పటి నుంచే కఠిన చర్యలు తీసుకుంటే దాని బారిన పండకుండా ఉండవచ్చన్నారు. ప్రజలంతా పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ సూచించారు. 


logo