ఆదివారం 24 మే 2020
National - Feb 13, 2020 , 02:55:33

ఆప్‌ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు

ఆప్‌ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు
  • ఒకరి మృతి, మరొకరికి గాయాలు

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆప్‌ కొత్త ఎమ్మెల్యే నరేశ్‌ యాదవ్‌ కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. గుడికి వెళ్లిన ఆయన కారులో ఇంటికి తిరిగి వస్తుండగా కిషన్‌గఢ్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఒక కారులో వచ్చిన వ్యక్తులు ఆప్‌ ఎమ్మెల్యే వాహన శ్రేణిలోని మరో కారులో ఉన్నవారిపై తుపాకీతో కాల్పులు జరుపగా, ఆప్‌ కార్యకర్త అశోక్‌ మన్‌ మరణించగా, మరో కార్యకర్త గాయపడినట్లు చెప్పారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ధర్మేందర్‌ అలియాస్‌ కల్లుగా గుర్తించి అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. మృతుడు అశోక్‌, నిందితుడు ధర్మేందర్‌ మధ్య కొంతకాలంగా వివాదం ఉన్నదని, గత ఏడాదితోపాటు ఇటీవల ఇరువురు పోట్లాడుకున్నారని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత కక్షలతోనే అశోక్‌పై ధర్మేందర్‌ కాల్పులు జరిపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. 
logo