మంగళవారం 26 మే 2020
National - May 22, 2020 , 16:14:24

షాహీనబాగ్‌లో 5 నెలల తర్వాత తెరుచుకున్న దుకాణాలు

షాహీనబాగ్‌లో 5 నెలల తర్వాత తెరుచుకున్న దుకాణాలు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో దాదాపు ఐదు నెలల తర్వాత దుకణాలు తెరుచుకున్నాయి. దేశమంతటా మార్చి 24 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చినా షాహీన్‌బాగ్‌లో మాత్రం అంతకుముందు నుంచే నిర్బంధం కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు అల్లర్లకు దారితీయడంతో అధికారులు నిరవధిక కర్ఫ్యూ విధించారు.

ఆ తర్వాత దేశంలో కరోనా మహమ్మారి విస్తరించింది. ఈ వైరస్‌ను కట్టడి చేయడానికి లాక్‌డౌన్ అమలు చేశారు. నాలుగో విడత లాక్‌డౌన్‌లో కేంద్రం ఇచ్చిన సడలింపుల మేరకు ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో సరి, బేసి విధానంలో షాపులు తెరిచేందుకు అనుమంతి లభించినా.. షాహీన్‌బాగ్‌లో మాత్రం కర్ఫ్యూ కొనసాగింది. అయితే, దాదాపు 5 నెలల తర్వాత ఈ రోజు షాహీన్‌బాగ్‌లో దుకాణాలు తెరిచేందుకు అనుమతి లభించింది.


logo