శుక్రవారం 03 జూలై 2020
National - Jul 01, 2020 , 17:09:40

హర్యానాలో తెరుచుకున్న షాపింగ్‌ మాల్స్‌

హర్యానాలో తెరుచుకున్న షాపింగ్‌ మాల్స్‌

చండీగఢ్‌: హర్యానాలో బుధవారం షాపింగ్‌ మాల్స్‌ తెరుచుకున్నాయి. కరోనా నేపథ్యంలో మాల్స్‌లోని షాపుల యజమానులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షాపింగ్‌ కోసం వచ్చే వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు. వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా మార్కింగ్‌ చేశారు. ప్రవేశ ద్వారం వద్ద వారికి శానిటైజర్లను అందజేస్తున్నారు. మరోవైపు ముందు జాగ్రత్త నేపథ్యంలో 65 ఏండ్లు పైబడిన వారిని, పది ఏండ్లలోపు చిన్న పిల్లలను అనుమతించబోమని కొందరు షాపింగ్‌ మాల్స్‌ యజమానులు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ వల్ల హర్యానాలో మూడు నెలలకుపైగా షాపింగ్‌ మాల్స్‌ మూతపడ్డాయి. కాగా, అన్‌లాక్‌-2లో భాగంగా బుధవారం నుంచి వీటిని పునరుద్ధరించారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo