మంగళవారం 26 మే 2020
National - May 08, 2020 , 13:23:04

'వారు లాక్‌డౌన్‌ క్వీన్స్‌.. వారికి వందనం'

'వారు లాక్‌డౌన్‌ క్వీన్స్‌.. వారికి వందనం'

  హైదరాబాద్ : ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ షాపర్స్ స్టాప్  వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. చిన్నప్పటి నుంచి మాతృమూర్తి  ధైర్యం, సాహసం,ఆత్మవిస్వాసం వంటివి నేర్పించింది. ఈ లాక్ డౌన్ క్లిష్టపరిస్థితుల్లో అవెంతో ఉపయోగపడుతున్నాయి. మదర్స్ డే సందర్భంగా అటువంటి మాతృమూర్తి లకు కృతజ్ఞతలు తెలపడానికి షాపర్స్ స్టాప్ "# లాక్ డౌన్ క్వీన్స్ "ప్రచారాన్ని ప్రారంభించింది. లాక్ డౌన్ సమయంలో ఆమె  నేర్పించిన అలవాట్లనే ఇప్పుడు అనుసరించి బతుకగలుగుతున్నాం. కాబట్టి అటువంటి మంచి విలువలు నేర్పించిన వారిని  "లాక్ డౌన్ క్వీన్స్"  గా ప్రకటించింది షాపర్స్ స్టాప్.  "మీ మాతృమూర్తి  మీకు ఏమి నేర్పించిందో.. ఈ లాక్‌డౌన్‌తో పోరాడటానికి ఇది మీకు ఎలా సహాయపడుతుందో మాకు చెప్పండి" అంటూ వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. షాపర్స్ స్టాప్ కు చెందిన సోషల్ మీడియా వేదికల ద్వారా తమ అనుభవాలు పంచుకొనే అవకాశం అందిస్తున్నది.  

 

 


logo