శుక్రవారం 03 జూలై 2020
National - Jun 24, 2020 , 11:09:22

టిక్‌టాక్ కోసం చిరుత‌ని ఇలా..!

టిక్‌టాక్ కోసం చిరుత‌ని ఇలా..!

టిక్‌టాక్ కోసం యువ‌త‌రం ఏం చేయ‌డానికి అయినా సిద్ద‌మైపోతున్నారు. చిరుత‌ను దూరం నుంచి చూస్తేనే భ‌య‌ప‌డ‌తారు. అలాంటిది వీళ్లు తాడుక‌ట్టి రోడ్డున న‌డిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. పోలీసుల‌కు తెలిస్తే కేసు పెడ‌తారు అనుకుంటే పొర‌పాటే.. ఎందుకంటే యువ‌కుల ప‌నికి పోలీసులు కూడా మ‌ద్ద‌తు తెలుపుతూ వెనుక‌ న‌డుస్తున్నారు. వీరిలో యువ‌తి కూడా ఉండ‌డం మ‌రింత ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్న‌ది.

నేపాల్‌లోని పర్భత్ జిల్లా, జల్జలా గ్రామంలో చిరుత పులి సంచరిస్తుందని గ్రామ ప్ర‌జ‌లు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు గ్రామానికి చేరుకునే స‌రికి కొంద‌రు యువ‌కులు చిరుత‌ను ప‌ట్టుకొని మెడ‌కు తాడుక‌ట్టి మేక‌పిల్ల‌ను ఊరేగించిన‌ట్టుగా తీసుకెళ్తున్నారు. ప‌నిలో ప‌నిగా అక్క‌డ యువ‌కులు టిక్‌టాక్ వీడియో చేసుకునేందుకు ఎగ‌బ‌డుతున్నారు. ఈ వీడియోలో ఒక అమ్మాయి కూడా ఉంది. ఈ సంఘ‌ట‌న‌పై పోలీసులు ఏమీ అన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.  


logo