బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 18:53:42

‘షోజా బంగ్లాయ్ బోల్చి’

‘షోజా బంగ్లాయ్ బోల్చి’

కోల్‌కతా : బీజేపీ సోషల్‌ మీడియా ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను చాటిచెప్పుకునేందుకు పశ్చిమ బెంగాల్‌ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆదివారం కొత్తగా ‘షోజా బంగ్లాయ్‌ బోల్చి’ ( ముక్కుసూటిగా బెంగాలీలో మాట్లాడడం) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టీఎంసీ రాజ్యసభ పార్టీ నాయకుడు డెరెక్‌ ఓబ్రియాన్‌ యాకరింగ్‌ చేసిన ఈ వీడియో సిరిస్‌ను వారానికి మూడు రోజులు విడుదల సోషల్‌ మీడియాలో విడుదల చేయనున్నారు. ప్రతి ఆదివారం, బుధవారం, శుక్రవారం ఉదయం 11 గంటలకు ఒక నిమిషం నిడివి ఉన్న క్లిప్పింగ్‌లు విడుదలవుతాయి.

‘ఈ సిరీస్ సోషల్ మీడియాలో వచ్చే కొద్ది నెలల పాటు నడుస్తుందని భావిస్తున్నారు’ అని టీఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది.  ప్రస్తుత సామాజిక, రాజకీయ, ఆర్థిక చట్రంలో ఉన్న అంశాలను ఈ వీడియోలు హైలైట్ చేయనున్నాయని పేర్కొంది. ‘మమతా బెనర్జీ నాయకత్వంలో గత తొమ్మిదేళ్లలో బెంగాల్ ఎలా అభివృద్ధి సాధించిందో కూడా వీడియోల్లో దృష్టి సారిస్తున్నారు. ఫెడరలిజం ఎలా బలహీనపడింది, రాష్ట్రాలు ఎలా నష్టపోయాయి అనే ఇతర అంశాలు ఉన్నాయి’ అని ఆ ప్రకటన పేర్కొంది.  టీఎంసీ వర్గాల ప్రకారం.. ‘రాష్ట్ర ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడానికి ఈ సోషల్‌ మీడియా ఉపయోగపడనుందని’ భావిస్తున్నారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పార్టీ సంస్థాగత పునర్వవ్యస్తీకరణను గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా యువకులు, కొత్తవారికి నాయకత్వ బాధ్యతలను ఇచ్చారు.

వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికలపైనే టీఎంసీ దృష్టి పెట్టింది. కాగా, రాష్ట్రంలో 42 లోక్‌సభ స్థానాలుండగా 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో 22 స్థానాల్లో గెలుపొందింది. అంతకు ముందు ఎన్నికల్లో 34 స్థానాల్లో గెలువగా ఈ సారి ఎన్నికల్లో 12 స్థానాలను కోల్పోయింది. అలాగే బీజేపీ ఈ సారి ఎన్నికల్లో 18 సీట్లలో గెలుపొందిన బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు స్థానాల్లో గెలుపొందగా, మొన్నటి ఫలితాలతో జోష్‌లో ఉంది. ఈ సారి ఎలాగైనా బెంగాల్‌లో అధికారం చేపట్టాలని కాషాయ పార్టీ కసరత్తులు చేస్తుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo