ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 15, 2020 , 16:37:56

బాటిల్ లో పెట్రోల్ పోయ‌లేద‌ని పాముల‌ను వ‌దిలేశాడు.. వీడియో

బాటిల్ లో పెట్రోల్ పోయ‌లేద‌ని పాముల‌ను వ‌దిలేశాడు.. వీడియో

ముంబై : బాటిల్ లో పెట్రోల్ పోయ‌లేద‌ని.. ఆ బంక్ కార్యాల‌యంలో పాముల‌ను వ‌దిలేసి అంద‌రినీ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ర్ట‌లోని బుల్దానా జిల్లాలో 13వ తేదీన సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో చోటు చేసుకుంది. ఓ యువ‌కుడు పెట్రోల్ కోస‌మ‌ని బంక్ కు వ‌చ్చాడు. అయితే వెంట తెచ్చుకున్న బాటిల్ లో పెట్రోల్ పోయాల‌ని అత‌ను కోరడంతో.. బంక్ సిబ్బంది తిర‌స్క‌రించారు.

దీంతో తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోనైన ఆ యువ‌కుడు.. బంక్ కార్యాల‌యం వ‌ద్ద‌కు వెళ్లాడు. ఆ క్యాబిన్ లో మూడు పాముల‌ను వ‌దిలేశాడు. అందులో రెండు నాగుపాములు ఉన్నాయి. ఈ పాముల‌ను చూసి అంద‌రూ వ‌ణికిపోయారు. క్యాబిన్ లో ఉన్న మ‌హిళ బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. ఈ దృశ్యాల‌న్ని అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.  బంక్ సిబ్బంది ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


logo