శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 12:57:04

తల్లీకుమార్తె ఎదుట అసభ్య ప్రవర్తన.. ఎస్‌హెచ్‌ఓ డిస్మిస్‌

తల్లీకుమార్తె ఎదుట అసభ్య ప్రవర్తన.. ఎస్‌హెచ్‌ఓ డిస్మిస్‌


లక్నో : ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళ, ఆమె కుమార్తె ఎదుట స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌(ఎస్‌హెచ్‌ఓ) అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా ఉన్నతాధికారులు చర్యలు చేపడుతూ అతన్ని విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇన్‌స్టెక్టర్‌ భీశంపాల్‌ సింగ్‌ డెఒరియా పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓగా పనిచేస్తున్నాడు. జూన్‌ 22వ తేదీన ఓ మహిళ ఆమె కూతురు భూ తగదా విషయంలో ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. కాగా ఫిర్యాదు స్వీకరించాల్సిందిపోయి వారిని హేళన చేస్తూ సదరు ఎస్‌హెచ్‌ఓ తల్లి, కుమార్తె ఎదుటే హస్తప్రయోగం చేశాడు. ఇన్‌స్పెక్టర్‌ అసభ్య ప్రవర్తనను కూతురు తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసింది. కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. వీడియో వైరల్‌ అయింది.  

ఉన్నతాధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. ఇన్‌స్పెక్టర్‌పై అదే పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దీంతో నిందితుడు పరారయ్యాడు. ఆచూకీ తెలిపితే రూ. 25 వేల పారితోషకం ఇవ్వనున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ప్రకటించింది. మొత్తంమీద గడిచిన బుధవారం నాడు ఇన్‌స్పెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా విధుల నుంచి మొత్తానికే డిస్మిస్‌ చేశారు. లాండ్‌ అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డైరక్టర్‌ జనరల్‌(ఏడీజీ) ప్రశాంత్‌ కుమార్‌ స్పందిస్తూ... మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలకు పాల్పడితే ఏ మాత్రం సహించేది లేదన్నారు. ఏ ఒక్కరూ చట్టానికి అతీతులు కారన్నారు. నిందితుడిపై వయోరిజం, మహిళల పట్ల అగౌరవంగా ఉండటం, చట్టాన్ని దిక్కరించడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.   


logo