గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 01:07:45

బలపరీక్షలో నెగ్గిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

బలపరీక్షలో నెగ్గిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మంగళవా రం ఆ రాష్ట్ర అసెంబ్లీ లో జరిగిన బలపరీక్ష లో విజయం సాధించారు. సీఎంగా సోమవారం బాధ్యతలు చేపట్టిన చౌహాన్‌ మూజువాణి ఓటుతో నెగ్గారు. కాంగ్రెస్‌ సభ్యులు హాజరుకాలేదు. రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభంకాగానే విశ్వాసాన్ని కోరు తూ చౌహాన్‌ తీర్మానాన్ని ప్రతిపాదించారు.  

సింధియాకు ఊరట

బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు ఊరట లభించింది. ఆయనతోపాటు కుటుం బంపై తాజాగా నమోదైన ఫోర్జరీ కేసును మూసేసినట్లు ఆ రాష్ట్ర ఆర్థిక నేర విభాగం తెలిపింది. కాగా, ఓ భూమి అమ్మకంలో సింధియా, ఆయన కుటుంబం ఫోర్జరీ పత్రా లు సృష్టించారని 2014లో సురేంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. 2018లో నాటి బీజే పీ ప్రభుత్వం ఈ కేసును మూసివేసింది. కమల్‌నాథ్‌ను సింధియా విభేదించడంతో మార్చి 12న ఆయన మరోసారి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.


logo
>>>>>>