శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 17:24:20

వర్చువల్‌లో మధ్యప్రదేశ్‌ కేబినెట్ సమావేశం

వర్చువల్‌లో మధ్యప్రదేశ్‌ కేబినెట్ సమావేశం

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అధ్యక్షతన మంగళవారం తొలిసారిగా వర్చువల్‌లో తొలి కేబినెట్‌ సమావేశం నిర్వహించారు. కరోనా పాజిటివ్‌గా పరీక్షించిన అనంతరం ఆయన మంగళవారం చిరాయు హాస్పిటల్‌ నుంచి వర్చువల్‌ కేబినెట్‌ సమావేశంలో పాల్గొని, మాట్లాడారు. ‘నేను బాగున్నాను. చురుగ్గా ఉండేందుకు ప్రత్నిస్తున్నాను. నా దగ్గు పోయింది. జ్వరం కూడా లేదు. కరోనా సోకడం ద్వారా నేను సొంతంగా టీ తయారు చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం చేస్తున్నాను. ఇది నాకు చాలా లాభపడింది. అనేక ఫిజియోథెరపీ సెషన్ల తర్వాత.. ఇటీవల ఆపరేషన్‌ కారణంగా నేను పిడికిలి పట్టకోలేకపోయాను. ఇప్పుడు ఇది పూర్తిగా బాగానే ఉంది’ అని సీఎం పేర్కొనడంతో సమావేశంలో నవ్వుల పూలు విరిశాయి.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘వర్చువల్‌ కేబినెట్‌ మీటింగ్‌ నిర్వహించడంతో ఇవాళ చరిత్ర సృష్టించామని, ఈ సందర్భంగా మా ప్రతిజ్ఞను ప్రదర్శించడానికి ఇదే సరైన సమయం, పరిస్థితులు ఎలా ఉన్నా, మన రాష్ట్ర ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం’ అన్నారు. అనంతరం రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా మాట్లాడుతూ చంబల్‌ ఎక్స్‌ప్రెస్‌వే పేరును ‘చంబల్‌ ప్రోగ్రెస్‌ వే’గా మార్చడంతో పాటు సహా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అటవీ శాఖకు, గ్రామీణ ప్రాంతానికి ఎంతో మేలు చేసే విధంగా సీఎంఏ (కంపెన్సేటరీ అఫరేస్ట్రేషన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ అథారిటీ) పథకానికి, సీఎం గ్రామీణ పథ్‌ వెండర్‌ రుణ పథకానికి ఆమోదం లభించింది. 22 నగర పంచాయతీల్లో 21 పునరుద్ధరించామని, 2020-2021 లో ప్రధానమంత్రి పంట బీమా పథకం కొనసాగుతుందని మిశ్రా తెలిపారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo