బుధవారం 03 జూన్ 2020
National - May 23, 2020 , 02:24:14

అయోధ్యలో బయటపడ్డ శివలింగం

అయోధ్యలో బయటపడ్డ శివలింగం

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపడుతున్న స్థలానికి సమీపంలో పలు హిందూ దేవుళ్ల విగ్రహాలు బయటపడినట్లు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది. ఆలయ నిర్మాణం కోసం భూమిని చదును చేస్తుండగా ఇవి వెలుగుచూసినట్లు తెలిపింది. వీటిలో ఐదు అడుగుల శివలింగం, నల్లగీటురాయి స్తంభాలు ఏడు, ఎర్రరాతి ఇసుక ధ్వజాలు ఆరు, కలశం, రాతి పుష్పాలు, ఇతర విగ్రహాలు ఉన్నట్లు ట్విట్టర్‌లో పేర్కొంది. పూర్వం ఇక్కడ రామాలయం ఉండేదని వీటి ద్వారా మరింత స్పష్టమవుతున్నదని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ చెప్పారు. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంలో ఆలయ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించారు. ట్రాక్టర్లు, జేసీబీలతో నేలను చదును చేస్తున్నారు. 


logo