శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 11:43:07

పోలీసు స్టేషన్‌ ఆవరణలో శివాలయం

పోలీసు స్టేషన్‌ ఆవరణలో శివాలయం

భోపాల్‌ : పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఆలయమేంటని సందేహం కలుగొచ్చు. కానీ మధ్యప్రదేశ్‌లోని సంత్‌ హిర్దారామ్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ ఆవరణలో శివాలయం ఉంది. ఆ ఆలయంలో శివుడికి పోలీసులు ప్రతి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ ఆలయానికి థానేశ్వర్‌ మహదేవ్‌ మందిర్‌గా నామకరణం చేశారు పోలీసులు. ఈ సందర్భంగా స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ శివపాల్‌ సింగ్‌ కుష్వాహా మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్‌ గేట్‌ వద్ద శివాలయం ఉందన్నారు. ఈ స్టేషన్‌లోని ప్రతి పోలీసు.. శివుడి ఆశీస్సుల కోసం ప్రార్థిస్తారు. అయితే ఈ ఆలయానికి థానేశ్వర్‌ మహదేవ్‌ మందిర్‌గా నామకరణం చేయాలని భక్తులు సూచించడంతో ఆ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కానిస్టేబుల్‌ యోగేంద్ర రాథోర్‌ మాట్లాడుతూ.. ప్రతి మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. 


logo